ఫాంట్ పరిమాణం
రామచంద్రాయ కీర్తన
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ ।
మామకాభీష్టదాయ మహిత మంగళం ॥
కోసలేశాయ మందహాస దాసపోషణాయ ।
వాసవాది వినుత సద్వరద మంగళం ॥ 1 ॥
చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ ।
హారకటక శోభితాయ భూరి మంగళం ॥ 2 ॥
లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ ।
జలద సద్రుశ దేహాయ చారు మంగళం ॥ 3 ॥
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ ।
చాప జాత గురు వరాయ భవ్య మంగళం ॥ 4 ॥
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ ।
అండజాతవాహనాయ అతుల మంగళం ॥ 5 ॥
విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ ।
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ॥ 6 ॥
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ ।
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం ॥ 7 ॥